Punjab: పంజాబ్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు

Punjab: అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసిన సీఎం చన్నీ

Update: 2021-09-28 15:31 GMT

సీఎం చన్నీ కాబినెట్ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Punjab: పంజాబ్‌లో పొలిటికల్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయగానే ఒక్కసారిగా పంజాబ్ పాలిటిక్స్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. సిద్ధూ రాజీనామా, అమరీందర్ సింగ్ హస్తిన పర్యటనతో ఒక్కసారిగా పంజాబ్‌లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. మధ్యాహ్నం తన పీసీసీ పదవితో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సిద్ధు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పంపిన సిద్ధూ.. లేఖలో పరోక్షంగా కెప్టెన్‌పై హాట్ కామెంట్స్ చేశారు. అమరీందర్‌కు వ్యక్తిత్వం లేదని.. తన స్వార్థం కోసం లాలూచీ పడతారని ఫైర్ అయ్యారు. పంజాబ్ భవిష్యత్తే తనకు ముఖ్యమన్న సిద్ధూ.. సంక్షేమం విషయంలో ఎవరితోనూ రాజీపడనన్నారు.

ఇది జరిగిన కాసేపటికే సిద్ధూపై తనదైన శైలిలో కెప్టెన్ రియాక్ట్ అయ్యారు. పంజాబ్ లాంటి స్టేట్‌కు పీసీసీ చీఫ్‌గా అతడు సరిపోడని తాను ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ చేరుతారనే వార్తలు సంచలనం సృష్టించాయి. సిద్ధూ రాజీనామా చేసిన కొన్ని నిమిషాల్లోనే అమరీందర్ ఢిల్లీకి వెళ్లడంతో కెప్టెన్ బీజేపీలో చేరడం ఖాయం అనుకున్నారంతా. అయితే, అమరీందర్ మాత్రం ఈ వార్తలను కొట్టిపడేశారు. తాను ఏ రాజకీయ నేతను కలిసేందుకు రాలేదని, ఢిల్లీలో తన క్వార్టర్స్ ఖాళీ చేసేందుకే వచ్చానని క్లారిటీ ఇచ్చారు.

ఇదంతా ఒకెత్తయితే సిద్ధూ రాజీనామా తర్వాత పరిణామాలు నెక్స్ట్‌లెవల్‌కు చేరాయి. సిద్ధూకు మద్దతుగా ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. వీరితో పాటు మరింత మంది సిద్ధూ మద్దతుదారులు రాజీనామా చేస్తారనే వార్తల నేపధ్యంలో పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ పరిస్థితిని చక్కిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన సీఎం చన్నీ.. మంత్రుల రాజీనామాపై ప్రధానంగా చర్చించారు. ఇదే సమయంలో పటియాల హౌజ్‌లో వాట్ నెక్స్ట్ అంటూ సిద్ధూ మద్దతుదారులు మంతనాలు కూడా చేయడం పంజాబ్‌లో హాట్‌టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News