మధ్యవర్తిత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ ఎన్వీ రమణ
NV Ramana: మధ్యవర్తిత్వంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
NV Ramana: మధ్యవర్తిత్వంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా-సింగపూర్ మీడియేషన్ సమ్మిట్లో పాల్గొన్న ఎన్వీ రమణ వివాదాల పరిష్కారంలో మొదటి దశలో మధ్యవర్తిత్వం ఉత్తమమార్గం అన్నారు. మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేసే చట్టం చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం 4.5 కోట్ల పెండింగ్ కేసులున్నాయన్న ఎన్వీ రమణ మహాభారత కాలంలోనే మధ్యవర్తిత్వం ఉందని గుర్తుచేశారు.