NV Ramana: కౌంటర్ పిటిషన్స్ పై సీజేఐ రమణ అసహనం
NV Ramana: కోర్టుల సమయం వృథా అవుతోందన్న ఎన్వీ రమణ
NV Ramana: కోర్టుల్లో దాఖలవుతున్న కౌంటర్ పిటిషన్స్ పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీరమణ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. రైతుల మీద కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న అజయ్ మిశ్రా బెయిల్ ను సవాల్ చేస్తూ లఖింపూర్ ఖేరీ బాధితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితేచీటిమాటికి దాఖలవుతున్న పిటిషన్ల కారణంగా అసలు విషయాలు పక్కదోవ పడుతున్నాయని, ముఖ్యమైన కేసుల విచారణకు అవరోధం కలుగుతుందని, కోర్టుల సమయం కూడా దుర్వినియోగం అవుతోందని రమణ కోర్టు హాల్లోనే వ్యాఖ్యానించారు. పర్యావరణంపై ఒక పిల్ దాఖలైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది వున్న ధర్మాసనాల ముందు 587 కేసులు పెండింగ్ లో ఉండగా.. వాటిలో ప్రధానమైనవి 35 కేసులే.