Moderna Vaccine: భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్ వ్యాక్సిన్
Moderna Vaccine: భారత్‌లో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
Moderna Vaccine: భారత్‌లో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ -వి కోవిడ్ టీకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నాలుగో టీకా మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. మోడెర్నా వ్యాక్సిన్‌ను సిప్లా కంపెనీ దిగుమతి చేయనుంది. మోడెర్నా అనేది మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) వ్యాక్సిన్. ఇది కరోనాపై 90 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు తేలింది. ఇండియాలో కరోనా వైరస్ కోసం అత్యవసర అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్ మోడెర్నా. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి లకు డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.