Tamilnadu: అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిన్నమ్మ శశికళ సంచలన నిర్ణయం
Tamilnadu: రాజకీయాలు, ప్రజాజీవితానికి గుడ్ బై చెప్పారు. * తాను రాజకీయాలకు రావడం లేదని చెప్పారు
Tamilnadu: తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిన్నమ్మ శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజాజీవితానికి గుడ్ బై చెప్పారు. తాను రాజకీయాలకు రావడం లేదని చెప్పారు. తనకు పదవుల మీద, అధికారం మీద ముందు నుంచి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. అమ్మ జయలలిత అభిమానులు అందరూ ఏకమై డీఎంకేను ఓడించాలని శశికళ పిలుపునిచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నమ్మ పాత్ర ఎలా ఉంటుందనే అంశంపై ఇటీవల పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అన్నాడీఎంకేను మళ్లీ ఆమె కైవసం చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సొంతంగా AMMK పార్టీని పెట్టారు. ఆయన జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అవినీతి కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నమ్మ ఆ పార్టీని ముందుండి నడిపిస్తారని, అన్నాడీఎంకే నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని భావించారు.
AMMK పార్టీని కూడా అన్నాడీఎంకేలో విలీనం చేసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పన్నీర్ సెల్వం మీద కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరిగింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాలో వారు సమావేశం అయ్యారు. తమిళనాడులో అన్నాడీఎంకే - బీజేపీ కూటమి గెలవాలంటే చిన్నమ్మ పార్టీని కూడా విలీనం చేసుకోవాలని అమిత్ షా ఒత్తిడి చేశారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను తమిళనాడు మంత్రి జయకుమార్ ఖండించారు.