Arunachal Pradesh Missing Boy: అరుణాచల్‌ యువకుడిని అప్పగించిన చైనా

Arunachal Pradesh Missing Boy: భారత సైన్యానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు

Update: 2022-01-27 09:33 GMT

అరుణాచల్‌ యువకుడిని అప్పగించిన చైనా

Arunachal Pradesh Missing Boy: దేశ సరిహద్దులో అదృశ్యమై అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన యువకుడు మిరామ్‌ తరోన్‌ను భారత్‌కు చైనా సైన్యం అప్పగించింది. ఎట్టకేలకు మిరామ్‌ తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

వారం రోజుల క్రితం ఇద్దరిని చైనా కిడ్నాప్ చేసింది. వారిలో ఒకరు తప్పించుకుని వచ్చి ఈ విషయం తెలియజేయడంతో విషయం బయటకు పొక్కింది. అయితే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కిడ్నాప్‌ కాకుండా.. అదృశ్యమైనట్టుగా పేర్కొంటుండడం గమనార్హం.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్‌ జిల్లా జిడో గ్రామానికి చెందిన మిరామ్‌ తరోన్‌ను చైనా సైనిక బలగాలు అపహరించుకుపోయినట్టు ఎంపీ తాపిర్‌ గావ్‌ ఇటీవల ట్విట్టర్‌లో వెల్లడించారు. సాంగ్‌పో నది అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించే చోట ఈ ఘటన జరిగింది.

ఎంపీ తాపిర్‌ గావ్‌ ట్విట్‌కు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ మేరకు భారత సైనికాధికారులు చైనా సైన్యాన్ని సంప్రదించారు. మిరామ్‌ను అప్పగించేందుకు చైనా సానుకూలంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య ఉన్న నిబంధనల ప్రకారం మిరామ్‌ అప్పగింత ఆలస్యమైనట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్విట్టర్‌లో తెలిపారు.


Tags:    

Similar News