China continues to deploy 40,000 troops: బుద్ధి మార్చుకోని చైనా.. సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే దిశగా చర్యలు ..
China continues to deploy 40,000 troops: భారత్ తో సైనిక మరియు దౌత్య మార్గాల ద్వారా అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ జోక్యం
China continues to deploy 40,000 troops: భారత్ తో సైనిక మరియు దౌత్య మార్గాల ద్వారా అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ జోక్యం చేసుకున్నప్పటికీ, చైనా వక్ర బుద్ధి మాత్రం మారడం లేదు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) పై ఒత్తిడిని తగ్గించడానికి చైనా ప్రయత్నించడం లేదు. ఇవే కాకుండా, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) కు చెందిన 40 వేల మంది సైనికులను తూర్పు లడఖ్ సెక్టార్‌లో మోహరించింది.
తూర్పు లడఖ్ సెక్టార్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుండి చైనా సైన్యం వెనక్కి తగ్గడం లేదని సాయుధ సిబ్బంది, సాయుధ వాహనాలు భారీగా ఉన్నాయని వార్తా సంస్థ ANI ను పేర్కొంది. గత వారం జరిగిన రెండు కార్ప్స్ కమాండర్ల మధ్య చివరి రౌండ్ చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితుల్లో ఎలాంటి పురోగతి లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చైనా కుం చెందిన వాయు రక్షణ వ్యవస్థ, సాయుధ వాహనాలు, పెద్ద ఆయుధాలు , దీర్ఘ శ్రేణి ఫిరంగిదళాలు ప్రస్తుతం ఎల్‌ఏసీ వెంట మోహరించాయి.
గత వారం రెండు సైన్యాల కమాండర్ల మధ్య చర్చలు జరిపినప్పటికీ గ్రౌండ్ పొజిషన్లలో మార్పు రాలేదని తెలుస్తోంది. అలానే చైనా ఫింగర్ 5 ప్రాంతం నుంచి వెళ్లడానికి సిద్దంగా లేదు. అంతేకాక ఇక్కడ ఒక పరిశీలన పోస్ట్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది.