India China Border Dispute: రష్యా వేదికగా భారత్‌-చైనా చర్చలు..!!

India China Border Dispute: స‌రిహ‌ద్దులో చైనా కవ్విస్తూనే ఉంది. దీంతో వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అప్ర‌మ‌త్త‌మైన భార‌త్.. స‌రిహ‌ద్దుల్లో సైనిక బల‌గాల‌ను మోహ‌రించింది.

Update: 2020-09-04 07:51 GMT

India China Border Dispute

India China Border Dispute: స‌రిహ‌ద్దులో చైనా  కవ్విస్తూనే ఉంది. దీంతో వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అప్ర‌మ‌త్త‌మైన భార‌త్.. స‌రిహ‌ద్దుల్లో సైనిక బల‌గాల‌ను మోహ‌రించింది. ఈ  త‌రుణంలో చైనాకు  దిమ్మాతిరిగేలా... మ‌రో మారు డిజిట‌ల్ వార్ ప్ర‌క‌టించింది. దీంతో సరిహద్దు ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు చైనా దిగి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) స‌మావేశంలో చైనా రక్షణ శాఖ మంత్రి వే ఫెంఝీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యేందుకు అవ‌కాశం కోరుతున్న‌ట్టు తెలుస్తుంది. గ‌త ఆరు నెల‌లుగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ స‌మావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే.. చైనా ప్రతిపాదనపై ఇప్పటి వరకు భారత్ అధికారికంగా స్పందించలేదు. కానీ, ఫెంఝీతో సమావేశానికి కేంద్రం క‌చ్చితంగా ఓకే అనేట్లు ఉంది. ఈ మేరకు కేంద్రం కూడా సానుకూల సంకేతాలు పంపుతోంది.

మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య సదస్సులో ముందుగా భారత్‌-చైనా రక్షణమంత్రులు సరిహద్దు వివాదాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు చైనా రక్షణమంత్రి వీ నుంచి ఆహ్వానం అందింది. సరిహద్దు తగాదాలపై చర్చలు కేంద్రం నుంచి సానుకూలత ఉండటంతో రాజ్‌నాథ్‌ దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇవాళ స్కో సదస్సులో భారత్‌-చైనా రక్షణ మంత్రులు భేటీ కానున్నారు. ప్రధాన సదస్సు పూర్తయ్యాక లేదా విరామ సమయంలో రక్షణ మంత్రులు తొలుత భేటీ అయిన ఇరువైపులా వాదనలు పంచుకోనున్నట్లు సమాచారం. అనంతరం వీటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఓ అంగీకారానికి రావాల్సి ఉంటుంది.

 అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ నుంచి అందిన అహ్వానానికి భారత విదేశాంగమంత్రి జై శంకర్‌ కూడా ఓకే  అన్నారు. స్కో సదస్సులో భాగంగా ఆయన సెప్టెంబర్‌ 10న చైనా విదేశాంగమంత్రి వాంగ్‌తో భేటీ కానున్నారు. చైనా ప్రతిపాదనపై స్పందిస్తూ చర్చల ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజాగా ఓ పుస్తకావిష్కరణ కోసం వర్చువల్‌ సభలో పాల్గొన్న జై శంకర్‌.. సరిహద్దుల్లో ప్రస్తుతం శాంతియుత పరిస్ధితులు ఉన్నాయని తాను చెప్పలేనన్నారు. అక్కడ యథాతథ పరిస్ధితులను భారత్‌-చైనా కూడా ఉల్లంఘించరాదన్నారు. సరిహద్దుల్లో ఏం జరిగినా వాటి ప్రభావం ఇరుదేశాలపై సంబంధాలపై పడుతుందన్నారు.

గత నెల 29 అర్ధరాత్రి పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు డ్రాగన్‌ విఫలయత్నం చేయడంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భారత్‌ చైనా ఎత్తును చిత్తు చేసేందుకు పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవు భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది.

ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌-4 పర్వతాలు చైనా కబ్జాలో ఉన్నాయి. అయితే ఆ ఫింగర్‌ ప్రాంతంలోనూ ఇతర పర్వత శిఖరాలను ఆకస్మికంగా తన అధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి పెంచింది. తద్వారా భవిష్యత్‌లో చర్చలు జరిపేటప్పుడు భారత్‌కు అనుకూల పరిస్థితి ఉంటుందని సైనిక వర్గాలు తెలిపాయి. సైన్యం అంచనాల ప్రకారం భారత్‌ వ్యూహాత్మక ఎత్తులు ఫలిస్తునట్లు అర్థమవుతోంది. అందుకే చర్చలకు ముందుగానే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 

Tags:    

Similar News