Viral News: రిజర్వాయర్ లో పడిన ఫోన్.. 21 లక్షల లీటర్ల నీటిని తోడేసిన అధికారి

Viral News: రిజర్వాయర్ లో పడిన ఫోన్.. 21 లక్షల నీటిని తోడేసిన అధికారి

Update: 2023-05-27 07:40 GMT

Viral News: రిజర్వాయర్ లో పడిన ఫోన్.. 21 లక్షల లీటర్ల నీటిని తోడేసిన అధికారి

Viral News: మీరు బోటు ఎక్కి నదిలో విహార యాత్ర చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్న మనోహర దృశ్యాలను చూస్తూ సెల్ఫీ దిగాలనుకున్నారు..వెంటనే మీ పాకెట్ లోంచి సెల్ ఫోన్ తీశారు..సెల్ఫీ దిగుతుండగా..మీ ఖరీదైన ఫోను చేజారి నదిలో పడిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు..అయ్యో ఎంతో విలువైన ఫోన్ చేజార్చుకున్నానే అని బాధపడతారు. అవకాశం ఉంటే గజ ఈతగాళ్లను రప్పించి ఒక ప్రయత్నం చేస్తారు. దొరికిందా ఓకే...దొరకలేదు అంటే...ప్రాప్తం ఇంతేలే అని మిమ్మల్ని మీరు సముదాయించుకుంటారు..ఔనా, మీరే కాదు మనలో చాలామంది ఇలానే చేస్తారు..కానీ ఒక వ్యక్తి మాత్రం మనలా ఆలోచించి సర్దుకుపోలేదు..తన ఫోను కోసం నదిలో నీటినే తోడేశాడు..ఏంటి నమ్మకం కలగడం లేదా..ఇది అక్షరాలా నిజం..మరి, ఈ విస్తుగొలిపే ఘటన ఎక్కడ జరిగింది..ఫోన్ దొరికిందా..ఎవరా వ్యక్తి..పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

చత్తీస్ గఢ్ కంకారా జిల్లా కొల్లబేడ ప్రాంతానికి చెందిన ఫుడ్ ఇన్స్ పెక్టర్ రాజేశ్ విశ్వాస్ ఈ నెల 21న ఖేర్ ఖట్ట డ్యామ్ ను సందర్శించారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా రూ.లక్ష విలువ చేసే ఆ అధికారి ఫోన్ చేజారి నీటిలో పడిపోయింది. కంగారుపడిన రాజేశ్ విశ్వాస్ వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చి గజఈతగాళ్లను రప్పించారు. వారు రిజర్వాయర్ లోకి దిగి ఫోన్ కోసం ముమ్మరంగా గాలించారు. కానీ దొరకలేదు. దీంతో అధికారిలో అసహనం పెరిగిపోయింది..డ్యామ్ ను ఖాళీ చేయిస్తే ఫోన్ దొరుకుతుందని ఒక ఆలోచన వచ్చింది. ఆ వచ్చిన ఆలోచనను ఆయన వెంటనే అమలు చేసేశాడు..

2 పంపులు 3 రోజులు 21లక్షల లీటర్ల నీరు:

ఆలోచన వచ్చిందే తడవుగా స్థానిక అధికారులతో మాట్లాడి 30 హెచ్ పీ సామర్థ్యం కలిగిన రెండు మోటారు పంపులను రిజర్వాయర్ వద్దకు చేర్చి నీటిని తోడే కార్యక్రమాన్ని చేపట్టారు. అలా ఆ అధికారి మూడు రోజుల పాటు మోటారు పంపుల సాయంతో 21 లక్షల లీటర్ల నీటిని రిజర్వాయర్ నుంచి ఎత్తిపోశారు.

గ్రామస్థుల ఆగ్రహం:

అధికారి రాజేశ్ విశ్వాస్ ఆగడాలు స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. పంట పొలాలకు ఉపయోగించే నీటిని వృథాగా ఎత్తిపోయడం పై మండిపడుతూ..ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారి రిజర్వాయర్ వద్దకు చేరి నీళ్లను తోడుతున్న మోటార్లను ఆపివేయించారు. రాజేశ్ విశ్వాస్ తోడేసిన నీటితో ఎంత లేదన్నా 15వందల ఎకరాలకు నీరు అందించవచ్చని గ్రామస్థులు చెబుతున్నారు. మరోవైపు చేసిన పనికి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నాకే నీటిని తోడుతున్నామని రాజేశ్ విశ్వాస్ తన పనిని సమర్థించుకుంటున్నారు.

రాజేశ్ విశ్వాస్ సమర్థన:

సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ వద్ద అనుమతి తీసుకున్నాకే నీటిని తోడానని రాజేశ్ విశ్వాస్ చెబుతున్నాడు. మూడ్నాలుగు అడుగుల మేర నీటిని తోడితే ఇబ్బంది లేదని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చినట్లు రాజేశ్ విశ్వాస్ తెలిపారు. అయితే సదరు అధికారి ఎక్కువ నీరు తోడలేదని చెబుతున్నా..రిజర్వాయర్ నుంచి ఐదు అడుగుల కంటే ఎక్కువ నీరు ఖాళీ అయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విమర్శలు..సస్పెండ్

ఈ ఘటన రాజకీయంగానూ దుమారం చెలరేగింది. కేవలం రూ.96 వేల ఫోన్ కోసం నీటిని వృథా చేయిస్తారా అంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో ఫుడ్ ఇన్స్ పెక్టర్ రాజేశ్ విశ్వాస్ ను కలెక్టర్ సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. సెల్ ఫోన్ లో డిపార్ట్ మెంట్ కు సంబంధించిన కీలక డేటా ఉండడంతోనే నీటిని తోడామంటూ రాజేశ్ విశ్వాస్ తన చర్యను సమర్థించుకోవడం విశేషం..

ఇంతకీ ఫోన్ దొరికిందా..??

21 లక్షల లీటర్ల నీటిని రిజర్వాయర్ నుంచి రాజేశ్ విశ్వాస్ ఎత్తిపోశారు. మరి, ఫోన్ దొరికిందా అంటే దొరికింది కానీ అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. నీటి బకెట్ లో పడితేనే ఎంత ఖరీదైన ఫోన్ అయినా పని చేయదు మరి, రిజర్వాయర్ లో పడిన ఫోన్ పని చేస్తుందని సదరు అధికారి ఎలా అనుకున్నాడో అర్థం కావడం లేదు..ఏదిఏమైనా, అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాజేశ్ విశ్వాస్ చేసిన ఆగడం క్షమించదగినది కాదు.


Tags:    

Similar News