Chhattisgarh Extends Lockdow: ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్ పొడిగింపు..
Chhattisgarh Extends Lockdown: భారత్ కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతున్నాయి.
Chhattisgarh Extends Lockdown: భారత్ కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ఇంకా విజృంభించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే మన దేశంలో మొత్తం కేసులు 15లక్షలకు చేరువైంది. ఈ సందర్భంలో లాక్‌డౌన్ ఒక్కటే నివారణ మార్గంగా కనిపిస్తున్నది. కానీ దేశ ఆర్ధిక వ్యవస్థ పతనం కావడం, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో మరిన్ని సడలింపులు కల్పిస్తూ, కేంద్ర సర్కారు అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ మాత్రం భిన్న నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో లాక్ డౌన్ ను ఆగస్టు 6 వరకు పొడిగిస్తూ భాగేల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు తీసుకున్నది. రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ సహా బిలాస్ పూర్, దుర్గ్, రాజ్ నానద్ గావ్, కోర్బా, అంబికాపూర్ తదితర ప్రధాన నగరాల్లో వచ్చే 6 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, వైరస్ విభృంజన ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిబంధన విధించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటిదాకా 7980 మొత్తం కేసులు నమోదయ్యాయి. అందులో 5వేల పైచిలుకు కేసులు గడిచిన నెల రోజుల్లోనే వెలుగు చూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మొత్తం కేసుల్లో 5172మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకోగా, 45మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,763గా ఉంది. దేశమంతా అన్ లాక్ 3.0 దిశగా అడుగులు వేస్తున్నవేళ కరోనా లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఛత్తీస్ గఢ్ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాష్ట్రాలే లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రం బాటలో మరికొన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ పొడగింపును ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.