Polling Update: ముగిసిన పోలింగ్‌.. మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 % నమోదు

Assembly Elections 2023: ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా బలగాలకు గాయాలు

Update: 2023-11-07 13:25 GMT

Polling Update: ముగిసిన పోలింగ్‌.. మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 % నమోదు

Assembly Elections 2023: చత్తీస్‌గడ్‌, మిజోరాంలో కొత్త ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ప్రజలు ఓటేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పార్టీలు సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నాయి. మిజోరాంలో అసెంబ్లీ పోలింగ్‌ పూర్తవగా, చత్తీస్‌గడ్‌ తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్‌.. మందకొడిగా సాగింది. చత్తీస్‌గడ్‌లో 70 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 2018 ఎన్నికల్లో 77 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. ఇక మిజోరాంలో తాజాగా 75.88 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. గత ఎన్నికల్లో మాత్రం 81 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. మిజోరాంలో ఈవీఎంలో సాంకేతిక సమస్యల కారణంగా.. ముఖ్యమంత్రి జోరాంతంగా తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు.

చత్తీస్‌గడ్‌లో 90 నియోజకవర్గాల్లో తొలి విడతలో 20 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. చత్తీస్‌గడ్‌లోని బస్తర్, దంతేవాడ్‌, కంకేర్‌, కవర్దా, రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతంలోని 20 నియోజకవర్గాల్లో 40 లక్షల 78 వేల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. 20 నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం భారీగా భద్రతను కల్పించింది. 12 నియోజకవర్గాల్లో సుమారు 60వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. సుక్మా, బిజాపుర్‌, కంకేర్ ప్రాంతాలో మావోయిస్టులు, సీఆర్‌పీఎఫ్ మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ కాల్పుల్లో ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. ఈ నియోజవర్గాల్లో గతంలో కాంగ్రెస్‌ 17 స్థానాల్లో విజయం సాధించింది.

తొలి దశలో బీజేపీకి చెందిన కీలక అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తోపాటు భావనా బొహ్రా, లతా ఉసెండి, గౌతమ్‌ ఉయికే పోటీ చేశారు. ఇక కాంగ్రెస్‌ తరఫున మొహమ్మద్‌ అక్బర్, సావిత్రి మనోజ్‌ మండవి, మాజీ పీసీసీ చీఫ్‌ మోహన్ మర్కమ్‌, విక్రమ్‌ మండవి, కవాసి లఖ్మా వంటి కీలక అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అధికార పార్టీ మాత్రం ఆశలన్నీ భూపేష్ బాఘేల్‌పైనే పెట్టుకుంది. 2013లో మావోయిస్ట్ దాడుల తరువాత.. కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. అలాంటి పార్టీని.. మళ్లీ అధికారంలోకి తేవడంలో బాఘెల్‌ విజయం సాధించాడు. ఇక బీజేపీ మాత్రం సంప్రదాయ ఫార్ములానే నేమ్ముకుంది. కేవలం మోడీనే నమ్ముకుని ప్రచారంలోకి దిగింది. కాంగ్రెస్‌ అవినీతిని అస్త్రాన్ని భుజానికి ఎత్తుకుంది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను అస్త్రంగా వాడుకుని.. నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ బీజేపీపై భూపేష్‌ బాఘేల్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ ఆరోపణల్లో పసలేదని.. దానితో కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం వాటిల్లదని బాఘేల్‌ స్పష్టం చేశారు.

చత్తీస్‌గడ్‌ రెండో దశ ప్రచారం కొనసాగుతోంది. కమళనాథులు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి కీలక నేతలను రంగంలోకి దింపింది. కాంగ్రెస్‌ అవినీతినే అస్త్రంగా చేసుకుని.. ప్రచారం నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లో బాఘేల్‌ 508 కోట్లను పెట్టుబడి పెట్టినట్టు ఈడీ ఆరోపించింది. దీంతో భూపేష్ బాఘేల్‌ను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, సీఎం భూపేష్‌ బాఘేల్‌ ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీని నమ్ముకుంటే.. ఏమీ జరగదని.. తమతోనే సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. మొత్తంగా చత్తీస్‌గడ్‌ రాజకీయాలు మాత్రం రసవత్తరంగా సాగుతున్నాయి. 

Tags:    

Similar News