ఏడు దశాబ్దాల తరువాత భారత్‌కు చీతాలు.. మోడీ బర్తడే స్పెషల్.. పులి విమానంలో చిరుతల రాక

Cheetahs: ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత చీతాల మెరుపు కదలికల్ని చూడబోతున్నాం.

Update: 2022-09-16 05:37 GMT

ఏడు దశాబ్దాల తరువాత భారత్‌కు చీతాలు.. మోడీ బర్తడే స్పెషల్.. పులి విమానంలో చిరుతల రాక

Cheetahs: ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత చీతాల మెరుపు కదలికల్ని చూడబోతున్నాం. అంతరించిపోతున్న వన్యప్రాణుల్ని పునురుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి ఎనమిది చీతాలను భారత్ కు తీసుకువస్తున్నారు. ప్రధాని మోడీ తన పుట్టిన రోజైన రేపు మధ్యప్రదేశ్ లోని కునో-పాల్పూర్ వణ్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి చీతాలను విడుదల చేస్తారు. రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. నమీబియా రాజధాని విండ్‌హెక్ నుంచి నేడు రాత్రి ప్రత్యేక విమానం బయలుదేరి రాజస్థాన్ జైపూర్ కి రేపు ఉదయం చేరుకుంటుంది. అక్కడినుంచి హెలికాప్టర్‌లో మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ కి తరలిస్తారు. చీతాలను తీసుకురావటానికి బీ747 బంబో జెట్ కు మార్పులు చేశారు. దీని ముందు భాగంలో చీతా బొమ్మను పెయింట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ప్రయాణంలో చీతాల బాగొగుల్ని చూడడానికి ముగ్గురు సంరక్షకులు వెంట ఉంటారు. కునో జాతీయ పార్కులో చీతాలను ఉంచడానికి భారీ ఎన్ క్లోజర్‌ను ఏర్పాటు చేశారు. చీతాల నుంచి ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా ఇప్పటికే వాటికి వ్యాక్సిన్లు ఇచ్చారు. నమీబియాలో వాతావరణానికి దగ్గరగా కునో పార్క్ ఉంటుంది. అందుకే అక్కడ వాటిని ఉంచాలని నిర్ణయించారు. 


Tags:    

Similar News