Chandrayaan 3: చంద్రయాన్ 3పై ఇస్రో కీలక అప్‌డేట్.. ల్యాండర్ దిగిన చోటు 2 టన్నుల మట్టి చెల్లాచెదరు
Chandrayaan 3: ఒక అద్భుతమైన ధూళి మేఘంగా ఏర్పడిన దీనిని చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు చెందిన ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా తీసిన చిత్రాల ద్వారా గుర్తించినట్లు ఇస్రో పేర్కొంది.
Chandrayaan 3: చంద్రయాన్-3మిషన్‌కు సంబంధించిన మరో సమాచారాన్ని ఇస్రో వెల్లడించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ సమయంలో ఉపరితలంపై ఉన్న సుమారు 2 టన్నుల చంద్రుడి మట్టి, ధూళి పైకి లేచినట్లు తెలిపింది. విక్రమ్ ల్యాండర్ దిగిన చంద్రుడి దక్షిణ ధృవం వద్ద 108 మీటర్ల మేర అక్కడి మట్టి, ధూళి విస్తరించినట్లు పేర్కొంది. ఒక అద్భుతమైన ధూళి మేఘంగా ఏర్పడిన దీనిని చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు చెందిన ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా తీసిన చిత్రాల ద్వారా గుర్తించినట్లు ఇస్రో పేర్కొంది.