Chandrayaan-3: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3..
Chandrayaan-3: నింగిలోకి దూసుకుపోతున్న LVM-3 రాకెట్
Chandrayaan-3: LVM-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. శ్రీహరికోట నుంచి చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. జాబిల్లి దక్షిణ ధృవం దగ్గర దిగడమే టార్గెట్ ఈ ప్రయోగం సాగుతోంది. 24 రోజుల పాటు రాకెట్ భూమి చుట్టూ తిరగనుంది. 613 కోట్లు బడ్జెట్‌తో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. 3 వేల 900 కిలోల బరువున్న చంద్రయాన్-3 .. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్‌పై దిగి ప్రయోగాలు చేయనుంది. చంద్రుడి ఉపరితలాన్ని రోవర్ అధ్యాయనం చేయనుంది.
వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధృవం దగ్గర దిగితే- జాబిల్లిపై ప్రయోగాల్లో ప్రపంచ దేశాలకు ఇప్పటిదాకా అందని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనుంది ఇస్రో. దక్షిణ ధృవం దగ్గర ఉపగ్రహాన్ని ల్యాండ్ చేసిన తొలి దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది.