PM Modi: ఆగస్టు 23ను స్పేస్‌డేగా ప్రకటించిన ప్రధాని.. ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివ శక్తిగా నామకరణం
PM Modi: చంద్రయాన్-3 సక్సెస్ అయిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్‌డేగా ప్రకటించారు ప్రధాని మోడీ.
PM Modi: చంద్రయాన్-3 సక్సెస్ అయిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్‌డేగా ప్రకటించారు ప్రధాని మోడీ. మూన్‌పై ల్యాండర్ దిగిన ప్రాంతానికి 'శివ శక్తి' గా నామకరణం చేశారు. చంద్రయాన్-2 వెళ్లిన చోటుకు తిరంగా పాయింట్ గా పిలవబడుతుందన్నారు. దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ లో ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని ప్రధాని మోడీ కొనియాడారు. బెంగళూరులోని ఇస్రో సెంటర్‌కి వెళ్లి శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడానికి కారణమైన సైంటిస్టులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. తాను సౌతాఫ్రికాలో ఉన్నా మనసంతా ఇండియాలోనే ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం చేశారు.