అతిపెద్ద జాతీయ జెండా రూపంలో విద్యార్ధుల మానవ హారం.. గిన్నీస్ రికార్డు..
Guinness World Record: స్వాతంత్ర్యం వచ్చి.. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు జరుగుతున్నాయి.
Guinness World Record: స్వాతంత్ర్యం వచ్చి.. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు జరుగుతున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఛండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియంలో రెపరెపలాడే అతిపెద్ద మానవ జెండా రూపంలో విద్యార్థులు గిన్నీస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో 7 వేల 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకంలోని రంగుల టీషర్టులను విద్యార్థులు ధరించారు. స్టేడియంలో మొదట జాతీయ గీతాలాపన జరిగింది. అనంతరం విద్యార్థులు జెండా ఆకారంలో నిలబడ్డారు. అనంతరం జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా చరిత్రను స్మరించుకునేందుకు తాము మానవ జెండా కోసం భారీగా తరలివచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ గవర్నర్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వారీలాల్ పురోహిత్, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి హాజరయ్యారు. గిన్నీస్ రికార్డును గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్‌కు ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు.