Low Pressure: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
Low Pressure: నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన * ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు
Low Pressure: బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే.. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం పడుతోంది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇక.. గత 20రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. ప్రస్తుతం వాతావరణం చల్లబడి వర్షాలు పడుతుండటంతో కొంత మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక.. ఉపరితల ఆవర్తనం కారణంగా అటు ఏపీలోను భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.