Lav Agarwal: దేశంలో ఒమిక్రాన్ మరింత ప్రభలే ఛాన్స్
Lav Agarwal: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఎట్టకేలకు భారత్ లోనూ కాలు మోపేసింది.
Lav Agarwal: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఎట్టకేలకు భారత్ లోనూ కాలు మోపేసింది. సౌతాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి జరిపిన పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది నాలుగు రోజుల క్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వీరిలో ఇద్దరికి ఎయిర్ పోర్టులో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఒమిక్రాన్ అని తేలింది. 66 ఏళ్ల వయసు, 46 ఏళ్ల వయసు కలిగిన ఆ ఇద్దరిని ఐసోలేషన్ కి తరలించారు. ప్రస్తుతానికి వారిద్దరికీ లక్షణాలు స్వల్పంగానే కనపడుతున్నాయి. వారితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వారికి టెస్టులు జరుపుతున్నారు. దేశంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర వైద్యా ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ సూచించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 29 దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది.
డెల్టా వేరియంట్ కన్నా ఐదు రెట్లు వేగంగా వ్యాప్తి చేందే వైరస్ కావడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కేరళ, మహారాష్ట్రలలో కరోనా వైరస్ కేసులు వారం రోజులుగా ఉథృతం కావడం పట్ల కూడా కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితిని ప్రధానికి వివరించినట్లు లవ్ అగర్వాల్ ప్రకటించారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని మాస్క్ లు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని లవ్ అగర్వల్ సూచించారు.