Railway Bridge: వరదల్లో కొట్టుకుపోయిన 90 ఏళ్లనాటి రైల్వే బ్రిడ్జి..
Railway Bridge: హిమాచల్ ప్రదేశ్‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు ఏకమై ప్రవహిస్తున్నాయి.
Railway Bridge: హిమాచల్ ప్రదేశ్‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు ఏకమై ప్రవహిస్తున్నాయి. కాంగ్రా జిల్లాలో వరద బీభత్సం మరీ ఎక్కువగా ఉంది. వరదల ధాటికి పటాన్‌కోట్ సమీపంలోని ఓ రైల్వే బ్రిడ్జి కొట్టుకుపోయింది. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లను కలుపుతూ చక్కీ నదిపై నిర్మించిన ఈ వంతెనకు చెందిన ఓ పిల్లరు భారీ వరద కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రైల్వే బ్రిడ్జ్ కూలిపోయింది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
1928లో బ్రిటీష్ వారు నిర్మించి ప్రారంభించిన ఈ మార్గంలో పఠాన్ కోట్, జోగిందర్ నగర్ మధ్య ప్రతి రోజు ఏడు రైళ్లు నడిచేవి. పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వందలాది గ్రామాలకు ఈ రైలు మార్గం జీవనాధారం. ఇక్కడ రోడ్డు, బస్సు సేవలు లేవు. ఈ గ్రామాల ప్రజలు కాంగ్రా జిల్లా కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు రైలు సేవలనే ఉపయోగిస్తుంటారు. నదీ గర్భంలో అక్రమ మైనింగ్‌తో 90 ఏళ్ల నాటి వంతెన బలహీనపడింది. ఓ పిల్లరు భారీ వరద కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రైల్వే బ్రిడ్జ్ కూలిపోయింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.