Covid-19 Vaccination: కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఖచ్చితంగా తెలుసుకోండి

Covid-19 Vaccination: కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Update: 2021-05-19 12:26 GMT

Covid-19 Vaccination: కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఖచ్చితంగా తెలుసుకోండి

Covid-19 Vaccination: కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వ్యాక్సినేషన్‌ విధానంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు నెగెటివ్ వచ్చిన 3 నెలల తర్వాతే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి కరోనా వస్తే.. వారికి పూర్తిగా తగ్గిన తర్వాతే మళ్లీ సెకండ్ డోస్ తీసుకోవాలి. వ్యాధి నుంచి కోలుకున్న 3 నెలల తర్వాత మళ్లీ టీకా వేయించుకోవాలి.

ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలున్న వారు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారు టీకా వేసుకోకపోవడమే మంచిది. 4-8 వారాల తర్వాత టీకా వేసుకోవాలి. పాలిచ్చే తల్లులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకుండా కోవిడ్ టీకాను వేసుకోవచ్చు. గర్భిణీలు మాత్రం వ్యాక్సిన్ తీసుకోకూడదు. కరోనా నుంచి కోలుకున్న వారు నెగెటివ్ వచ్చిన 14 రోజుల తర్వాత రక్త దానం చేయవచ్చు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా 14 రోజుల తర్వాత తమ రక్తాన్ని దానం చేయవచ్చు. వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు అవసరం లేదు. అయితే గర్భిణీలకు కొవిడ్‌ టీకా అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్‌ విధానంలో తాజా మార్పులను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

Tags:    

Similar News