ఒమిక్రాన్ వ్యాప్తిపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం.. నైట్ కర్ఫ్యూ విధించాలని..

Night Curfew: కరోనా సెకండ్​ వేవ్ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవరపెడుతోంది.

Update: 2021-12-23 01:12 GMT

ఒమిక్రాన్ వ్యాప్తిపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం.. నైట్ కర్ఫ్యూ విధించాలని..

Night Curfew: కరోనా సెకండ్​ వేవ్ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేస్తూ లేఖ రాసింది. ఒమిక్రాన్​ కట్టడి చేయడానికి అవసరమైతే 'నైట్​ కర్ఫ్యూ' పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్​భూషణ్ ​అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.

రానున్న క్రిస్మస్​, న్యూ ఇయర్ ​వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. జన సమూహాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను తగ్గించాలని కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలంతా ఫేస్​మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని, కరోనా పరీక్షలు, నిఘా పెంచడంతో పాటు అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

Tags:    

Similar News