జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court: జీఎస్టీపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.
Supreme Court: జీఎస్టీపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులకు కేంద్ర, రాష్ట్రాలు కట్టుబడాల్సిన అవసరం లేదని గుర్తుచేసిన ధర్మాసనం పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వురే చట్టాలు చేసుకోవచ్చని సూచించింది. అవసరమనుకుంటే ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్టికల్ 246A ప్రకారం పన్నులను సంబంధించిన చట్టాలను చేసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలుంటాయని స్పష్టం చేసింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది.