Railway Recruitment 2022: పదో తరగతితో రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు.. చివరి తేదీ

Railway Recruitment 2022: పదో తరగతితో రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు.. చివరి తేదీ

Update: 2022-02-12 09:30 GMT

Railway Recruitment 2022: పదో తరగతితో రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Railway Recruitment 2022: పదో తరగతి చదివిన వారికి గుడ్‌ న్యూస్‌. ఇండియన్ రైల్వే ట్రేడ్‌ విభాగంలో అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2422 ఖాళీలు ఉన్నాయి. జనవరి 17, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. పదోతరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ముంబైలో ఖాళీలు..క్యారెజ్‌ అండ్‌ వేగన్‌ (కోచింగ్‌) వాడి బండర్‌ 258, కళ్యాణ్‌ డీజిల్‌ షెడ్‌ 50

కుర్లా డీజిల్‌ షెడ్‌ 60, Sr.DEE(TRS) కళ్యాణ్ 179, Sr.DEE(TRS) కుర్లా192, పరేల్ వర్క్‌షాప్ 313, మాతుంగా వర్క్‌షాప్ 547 S&T వర్క్‌షాప్, బైకుల్లా 60

భుసావల్‌లో ఖాళీలు

క్యారేజ్ & వ్యాగన్ డిపో122, ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్80, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్, భుసావల్118, మన్మాడ్ వర్క్‌షాప్51, TMW నాసిక్ రోడ్47

పూణేలో ఖాళీలు

క్యారేజ్ & వ్యాగన్ డిపో31, డీజిల్ లోకో షెడ్ 121 పోస్టులు

నాగ్‌పూర్‌లో ఖాళీలు

ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని 48, క్యారేజ్ & వ్యాగన్ డిపో 66

షోలాపూర్‌లో ఖాళీలు

క్యారేజ్ & వ్యాగన్ డిపో58, కుర్దువాడి వర్క్‌షాప్ 21

ఎంపిక విధానం

అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము ఓబీసీ/జనరల్‌ అభ్యర్ధులకు రూ.100 ఇతరులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 16, 2022గా నిర్ణయించారు. చివరి తేదీ వరకు చూడకుండా వెంటనే అప్లై చేయండి లేదంటే ఆ రోజు సర్వర్ బిజీగా ఉండే అవకాశాలు ఉంటాయి.

Tags:    

Similar News