మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం అడుగులు

India: ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రహోంశాఖ సమావేశం

Update: 2021-09-26 03:01 GMT

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోమ్ శాఖా సమావేశం (ఫైల్ ఇమేజ్)

India: మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా కేంద్రం సమీక్ష నిర్వహిస్తుంది. మావోయిస్ట్‌ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం.. నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించడం లాంటివి చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

యువత విప్లవానికి ప్రభావితం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకోనున్నాయి. ఇందుకోసం గడిచిన ఐదేళ్లుగా కేంద్ర హోంశాఖ మూడు విధాలుగా నిధులు మంజూరు చేస్తూ వస్తోంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణం, మొబైల్‌ టవర్ల ఏర్పాటు, బ్యాంకులు, పోస్టాపీసుల ఏర్పాటు వంటివి కేంద్రం చేపడుతోంది. వీటితో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు వాటి ద్వారా ఉద్యోగాల కల్పనకు, విద్యాసంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తూ వస్తోంది.

ప్రతి ఏటా జరిగే కేంద్రహోంశాఖ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొలిసారి హాజరు కానున్నారు. సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్‌ అదనపు డీజీపీ అనిల్‌కుమార్‌ హాజరుకానున్నారు. అయితే తెలంగాణలో మావోయిస్టుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెంగా కేంద్రం గుర్తించింది. ఇక ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు తక్కువ ప్రాబల్యం కలిగిన జిల్లాలుగా కేంద్ర హోంశాఖ గుర్తించింది.

అయితే కేంద్ర హోంశాఖను మరిన్ని నిధులు కోరనుంది తెలంగాణ ప్రభుత్వం. SRE, SIS, SCA పథకాలకు అదనపు నిధుల కోసం సీఎం కేసీఆర్ కేంద్రాన్ని రిక్వెస్ట్‌ చేయనున్నారు.ష్ట్రానికి SRE స్కీం కింద కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి 2021 వరకు 42 కోట్ల రూపాయాలను కేటాయించింది. SIS పథకానికి 13కోట్ల 12 లక్షల నిధులను మంజూరు చేసింది. ఇటు SCA పథకానికి 85కోట్ల 92లక్షలు కేటాయించింది. అయితే ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పాటు కావడాన్ని ప్రస్తావిస్తూ వాటి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా అమిత్‌షాను సీఎం కోరనున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News