Coronavirus: కేంద్రమంత్రి కుమార్తె మృతి
Coronavirus: గోయిత సోలంకి చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారని ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించాయి.
Coronavirus: కరోనా వైరస్ రెండో దశ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుంది. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవరిని వదలిపెట్టడం లేదు. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలు విడిచారు. ప్రాణాలు కొల్పోయిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి తావర్ చంద్ గహ్లోత్ కుమార్తె గోయిత సోలంకి (42) కరోనా బారినపడి కన్నుమూశారు. గోయిత సోలంకి చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారని ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించాయి.
మొదట కరోనా సోకిన వెంటనే ఆమెను ఉజ్జయినిలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో వారం క్రితం ఇండోర్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే సోలంకి ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ చేరడంతో.. 80 శాతం వైరస్ బారినపడటంతో మరణించారని ఆస్పత్రి డైరెక్టర్ సందీప్ శ్రీవాస్తవ వెల్లడించారు. సోలంను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేశామని వెల్లడించారు. గోయిత మరణం పట్ల మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ విచారం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 15,04,698 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా 3,68,147 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,99 కోట్లకు చేరింది. అయితే కోవిడ్ వల్ల 3,417 మంది కోవిడ్ వల్ల మృత్యువాత పడ్డారు.