India: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సమావేశం

India: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సీఎంల సమావేశం

Update: 2021-09-26 06:00 GMT
ముఖ్యమతులతో బీటీ అయిన కేంద్ర హోమ్ శాఖా (ఫైల్ ఇమేజ్)

India: గతేడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాద ప్రభావం, మావోయిస్టు పార్టీ ప్రాబల్యం తగ్గిందని బలంగా అభిప్రాయపడుతోంది కేంద్ర హోంశాఖ. ఈనేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఇవాళ పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ హోంమంత్రి సుచరిత ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.

తెలంగాణ, ఏపీతో పాటు ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మాత్రమే మావోయిస్టు పార్టీకి పునాది లేకుండా చేయవచ్చని కేంద్ర హోంశాఖ భావిస్తుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంయుక్త గాలింపు చర్యలను మరింత ఉధృతం చేసే దిశగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

వివిధ రాష్ట్రాలతో సాంకేతికంగా, శాఖాపరంగా సమన్వయం కొనసాగిస్తూ చేపట్టిన ఆపరేషన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయని అంచనాకు వచ్చిన కేంద్ర హోం మంత్రి.. ఈ సమావేశంలో రాష్ట్రాల నుంచి వివరాలను తెలుసుకోనున్నారు. మరోవైపు నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రజల రాకపోకల కష్టాలను తొలగించడానికి బ్రిడ్జీల నిర్మాణం, విద్యా సంస్థలను నెలకొల్పడం, వైద్య సైకర్యాలను అందుబాటులోకి తేవడం లాంటి అంశాలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News