Coronavirus Effect: కేంద్ర ఆరోగ్య శాఖలో కరోనా కలకలం.. కీలక అధికారికి కరోనా పాజిటివ్..

Coronavirus Effect: ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది కరోనా. దీనివల్ల ధనిక, పేద, అధికారం, అనధికారం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అందరినీ ఒక గాటన పెట్టి సోకుతోంది.

Update: 2020-08-15 09:15 GMT
Representational Image

Coronavirus Effect: ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది కరోనా. దీనివల్ల ధనిక, పేద, అధికారం, అనధికారం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అందరినీ ఒక గాటన పెట్టి సోకుతోంది. అయితే దీనిని ఎదురించి, ధైర్యంగా కొంతమంది కోలుకుంటే, మరి కొంత మంది ఎదురొడ్డి పోరాటం చేయలేక మరణిస్తున్నారు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖా సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే, ఆయనే స్వయంగా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతే కాదు నిబంధనలు ప్రకారం ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవలే తనను కలిసిన వారంతా స్వీయనిర్భందంలోకి వెల్లాలని కోరారు. కేంద్రం విదించిన లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ పై కేంద్రం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అయన ఎన్నోసార్లు మీడియా సమావేశాల్లో వివరించిన విషయం తెలిసిందే.



ఇక దేశంలో కరోనా కేసులు అధికంగానే నమోదయ్యాయి. కేసుల సంఖ్య 25 లక్షల 26 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 65,002 కేసులు నమోదు కాగా, 996 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 57,381 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో మొత్తం 25,26,192 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,68,220 ఉండగా, 18,08,936 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఇదిలా ఉండగా 49,036 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71.77 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.95 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 26.88 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో 8,68,679 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 2,85,63,095కి చేరింది.


Tags:    

Similar News