Covaxin: కోవాగ్జిన్ ఉత్పత్తి పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Covaxin: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటాయి.

Update: 2021-04-16 03:15 GMT

కోవాగ్జిన్ (ఫొటో ట్విట్టర్)

Covaxin: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటాయి. ఉత్తరాది రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. కరోనాపై పోరాటంలో భాగంగా.. కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ముంబైకి చెందిన హాఫ్ కైన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ కు అనుమతి మంజూరు చేసింది.

ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తోంది. సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రస్తావన తెచ్చారు. మహారాష్ట్ర సీఎం అభ్యర్థనను ఆమోదిస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News