Central Government: ఆరేళ్ళలో 300 శాతం పెరిగిన పెట్రోల్‌పై ఆదాయం
Central Government: పెట్రోల్, డీజిల్ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి ఎంత పిండేస్తోందో పార్లమెంట్ సాక్షిగా వెల్లడైంది.
Central Government: పెట్రోల్, డీజిల్ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి ఎంత పిండేస్తోందో పార్లమెంట్ సాక్షిగా వెల్లడైంది. పెట్రో ఉత్పత్తులపై కేంద్రానికి వచ్చే ఆదాయం ఆరేళ్ళలో 300 శాతం పెరిగిందని స్వయంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రే చెప్పారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పెట్రోల్, డీజిల్‌పై కేంద్రానికి 72 వేల కోట్ల ఆదాయం లభించింది.
అదే 2020-21 ఆర్థిక సంవత్సరం పది నెలల కాలానికే 2 లక్షల 94 వేల కోట్ల ఆదాయం పొందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలల ఆదాయం ఎంతో తేలాల్సి ఉంది. 2014లో పెట్రోల్ మీద విధించే ఎక్సైజ్ సుంకం 9 రూపాయల 48 పైసలు కాగా ప్రస్తుతం 32 రూపాయల 90 పైసలకు చేరింది. డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం 3 రూపాయల 56 పైసల నుంచి ఆరేళ్ళలో 31 రూపాయల 80 పైసలకు పెరిగింది.