Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి కేంద్రం మరో షాక్‌!

Priyanka Gandhi: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ కి మరో షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

Update: 2020-07-01 15:42 GMT
Priyanka Gandhi (File Photo)

Priyanka Gandhi: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ కి మరో షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం... ఇప్పటికే ఆమెకి ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) భద్రతను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత లేనందున 1997 లో తనకు కేటాయించిన లోధి ఎస్టేట్‌లోని ప్రియాంక గాంధీ బంగ్లా 35 నుంచి తప్పక బయలుదేరాలని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమ నోటీసులో పేర్కొంది. ఈ మేరకు ప్రియాంక గాంధీకి లేఖ రాసింది.. ఆగస్ట్‌ 1లోపు ఖాళీ చేయాలని కోరింది.

అలా కాకుండా కొనసాగితే జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఖాళీ చేసేముందు పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని పేర్కొంది. ఇక 2020 జూన్ 30 నాటికి ప్రియాంక గాంధీ రూ.3,46,677 పెండింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తించారు. తాజాగా ఆమెకి ఎస్‌పీజీ భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం ఆమె భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి తగ్గించింది..

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల కుమార్తె గా అందరికీ సుపరిచితురాలు అయిన ప్రియాంక గాంధీ అతి తక్కువ సమయంలోనే రాజకీయ నాయకురాలిగా ఎదిగారు.. ఇక ఈమె ఢిల్లీ కి చెందిన ప్రముఖ వ్యాపారి రబార్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఫిబ్రవరి 18,1997 నా గాంధీ హోమ్ లో జరిగింది. వీరి పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది.  



Tags:    

Similar News