Post Office: పెట్టుబడి పెట్టేవారికి న్యూఇయర్‌ గిఫ్ట్‌? ఆ పథకాల వడ్డీ పెంపు

Update: 2024-12-29 10:25 GMT

Interest rates on Post Office Savings Schemes: కొత్తేడాదిలో అడుగు పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో కొత్తగా పొదుపు చేపట్టాలని నిర్ణయించుకున్న వారికి ఓ న్యూస్‌ ఊరటనిస్తోంది. పలు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతోన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టాఫీస్‌ అందిస్తోన్న సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

2024-25కి సంబంధించి నాలుగో త్రైమాసికానికి గానూ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమయంలో కొన్ని రకాల పథకాలకు సంబంధించి ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లకు సంబంధించిన డిసెంబర్ 31వ తేదీన సమీక్ష జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

నిజానికి ఈ ఆర్థిక ఏడాది అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్లను పెంచుతారని అంతా భావించారు. మరీ ముఖ్యంగా పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి కీలక పథకాలపై వడ్డీ పెంచుతారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ప్రభుత్వం నిరాశపరిచింది. అయితే ప్రస్తుతం మాత్రం కచ్చితంగా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సూకన్య సమృద్ధి యోజనపై గరిష్ఠంగా 8.20 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై 8.20 శాతం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పథకానికి 7.70 శాతం, కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ ద్వారా 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. వీటితోపాటు పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్స్‌పై 4 శాతం, ఏడాది టర్మ్ డిపాజిట్లపై 6.90 శాతం, రెండేళ్ల టైమ్ డిపాజిట్లపై 7 శాతం, మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.10 శాతం, ఐదు సంవత్సరాల టైమ్ డిపాజిట్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఈ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం కొత్తేడాది గుడ్‌ న్యూస్‌ చెప్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News