Guidelines for Schools Re-Open: సెప్టెంబర్ 1 నుంచి బడులు.. మార్గదర్శకాలు జరీ చేసిన కేంద్రం..

Guidelines for Schools Re-Open: మార్చి నెల మూడవ వారం నుంచి కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మూతబడ్డాయి.

Update: 2020-08-08 11:22 GMT

Guidelines for Schools Re-Open: మార్చి నెల మూడవ వారం నుంచి కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మూతబడ్డాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు కూడా మూత పడ్డాయి. ఇక కొన్ని పరీక్షలను రద్దు చేస్తే మరికొన్ని పరీక్షలను వాయిదా వేశారు. ప్రస్తుతం కొన్ని విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళు మూసి ఉంచిన‌ పాఠ‌శాల‌ల‌ను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా పాఠశాలలు తిరిగి పునః ప్రరంభించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ విషయంపై కేంద్రం మార్గదర్శకాలు జరీ చేసింది.

లోక్ డౌన్ ఎత్తివేత సమయంలో ఆగష్టు 31 తరువాత అనుసరించాల్సిన విదానలపై కేంద్రం మార్గదర్శకాలు జరీ చేసింది.. కోవిడ్ 19 కేసులు పరిసీలించడంతో పాటు, బడులు నిర్వహణ, అలాగే విద్యార్ధుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణంలోకి తెసుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది. అయితే, సిబ్బంది షిఫ్ట్ ల వారీగా బోదించాలని.. తరగతి గదుల్లో విద్యార్ధులు 2-3 గంటలు మాత్రమే ఉండలని, మొదటి షిఫ్ట్ 8-11 గంటల వరకు.. రెండోవ షిఫ్ట్ 12-3 గంటల వరకు నిర్వహించాలని.. షిఫ్ట్ పూర్తయిన తరువాత తరుగతి గదులను పూర్తిగా శానిటైజ్చే యాలనీ.. ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తెసుకున్తామని.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జరీ చేసింది.

దేశంలో కరోనా కేసులు చూస్తే.. భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 20 లక్షల 88 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 61,537 కేసులు నమోదు కాగా, 933 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 48,900 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 20,88,612 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,19,088 ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 42,518 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 67.98 శాతంగా ఉంది. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,33,87,171 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 5,98,778 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.



Tags:    

Similar News