థియేటర్ల ఓనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Update: 2021-01-31 07:05 GMT

Representational Image

థియేటర్ల ఓనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌చ్చని చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్రసారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గద‌ర్శకాల‌ను జారీ చేసింది. సినిమాలు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 100 శాతం సీట్లను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది.

గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా ఇప్పటి వర‌కూ కేవ‌లం 50 శాతం కెపాసిటీతోనే న‌డ‌ప‌డానికి అనుమ‌తి ఉండేది. దీంతో థియేట‌ర్ల ఓన‌ర్లు తాము న‌ష్టాల పాల‌వుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు వంద శాతం సీట్లు నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా.. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజ‌ర్లు, టెంప‌రేచ‌ర్ చెకింగ్‌లు, షో టైమింగ్స్‌, బుకింగ్స్‌లో మార్పులు చేయాల‌ని ఆ మార్గద‌ర్శకాల్లో కేంద్రం స్పష్టంగా ఆదేశించింది.

Full View


Tags:    

Similar News