కేంద్ర ప్రభుత్వం దీపావళికి అద్దిరిపోయే శుభవార్త... పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గింపు

Petrol, Diesel Price Down: గత కొంత కాలంలో సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఇంధన ధరలకు కళ్లెం వేస్తున్నట్లు ప్రకటించింది

Update: 2021-11-03 15:43 GMT

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం (ఫైల్ ఇమేజ్)

Petrol, Diesel Price: దేశప్రజలకు కేంద్ర ప్రభుత్వం దీపావళికి అద్దిరిపోయే శుభవార్త చెప్పింది. గత కొంత కాలంలో సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఇంధన ధరలకు కళ్లెం వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేనా, పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై పది రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచీ అందుబాటులోకి వస్తాయంది. మరోవైపు. వాహనదారులకు మరింత ఊరట కల్పించేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదే సమయంలో దీపావళి పర్వదినం వేళ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా రీసెంట్‌గా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో చాలా చోట్ల బీజేపీని కాదని ఇతర పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే కేంద్రం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌ ధరలు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపాయన్న వాదనలు గట్టిగా వినిపించాయి. దీంతో ప్రజలకు కాస్త ఊరట కల్పించేలా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రకటించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. వరుసగా పెరుగుతున్న అధిక ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు.. కేంద్రం తాజాగా ప్రకటన కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి.

Tags:    

Similar News