Port Blair: అండమాన్-నికోబార్ రాజధాని పేరును శ్రీ విజయపురం అని మార్చిన కేంద్రం... ఇంతకీ ఎవరీ పోర్ట్ బ్లెయిర్?

Port Blair is Now Sri Vijaya Puram: పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీవిజయపురం అని మార్చుతున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించింది.

Update: 2024-09-14 03:30 GMT

Port Blair: అండమాన్-నికోబార్ రాజధాని పేరును శ్రీ విజయపురం అని మార్చిన కేంద్రం... ఇంతకీ ఎవరీ పోర్ట్ బ్లెయిర్?

Port Blair is Now Sri Vijaya Puram: పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీవిజయపురం అని మార్చుతున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించింది. వలసపాలన ఆనవాళ్ళ నుంచి విముక్తం కావాలనే ప్రధాని మోదీ దార్శనికత స్ఫూర్తిగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చుతున్నట్లు హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

“అండమాన్ - నికోబార్ దీవులలో జరిగిన స్వతంత్ర పోరాటానికి ప్రతీకగా శ్రీ విజయ పురం ధ్వనిస్తుంది. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అండమాన్ – నికోబార్ దీవుల పాత్ర చాలా విలువైనది. ఒకప్పుడు చోళుల నౌకాశ్రయంగా ఉన్న ఈ దీవులు ఇప్పుడు భారతదేశ వ్యూహాత్మక స్థావరంగా ఉన్నాయి” అని అమిత్ షా వివరించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా మూడు రంగుల జెండాను ఎగురవేసింది ఈ దీవుల్లోనేనని, వీర సావర్కర్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో ఇక్కడి సెల్యులర్ జైలులో గడిపారని ఆయన గుర్తు చేశారు.

శ్రీ విజయ పురం అనే పేరు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ నగరం పాత్రను గుర్తు చేస్తుందని అమిత్ షా అన్నారు.

పోర్ట్ బ్లయర్ అనే పేరు ఎలా వచ్చింది?

భారతదేశం బ్రిటిషర్ల పాలనలో ఉన్న 18వ శతాబ్దంలో లెఫ్టినెంట్ ఆర్చిబాల్డ్ బ్లెయర్ ఇక్కడ నావల్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆయన పేరు మీదే ఈ నగరానికి పోర్ట్ బ్లెయిర్ అనే పేరు పెట్టారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ దీవుల్లో నౌక స్థావరాన్ని బలంగా ఏర్పాటు చేసే లక్ష్యంతో బ్లెయిర్ ఇక్కడ పని చేశారు.

ఒకప్పుడు కేవలం జాలర్ల పల్లెగా ఉన్న ఈ నగరంలో బెంగాల్‌ బ్రిటిష్ గవర్నమెంట్ 1789లో చత్తాం దీవిలో ఖైదీల కోసం సెటిల్మెంట్ కాలనీకి పునాదులు వేసింది. ఆ తరువాత అండమాన్ దీవి దక్షిణ భాగాన ఉన్న ఈ ప్రాంతానికి ఆర్చ్‌బాల్డ్ బ్లెయిర్ పేరు పెట్టారు.

బ్లెయిర్ ఆ దీవులను పూర్తిగా స్రవే చేసి అక్కడ పాలక యంత్రాంగ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ దీవులకు కేంద్రంగా వలస కాలనీల నిర్మాణాన్ని కొనసాగించారు. బ్రిటిష్ పాలకులకు ఆ నగరాన్ని కీలక స్థావరంగా మార్చారు. ఆయన కృష్టి వల్లే పోర్ట్ బ్లెయిర్ నగరం బ్రిటిష్ నౌకా కార్యకలాపాల వ్యవస్థలో వ్యూహాత్మక స్థావరంగా అభివృద్ధి చెందింది. ఆయన సేవలకు గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ రాజధాని నగరానికి పోర్ట్ బ్లెయిర్ అని నామకరణం చేసింది.

కేవలం చేపలు పట్టుకుని జీవించే ప్రజల ఆవాసమైన ఈ ప్రాంతం అలా పోర్ట్ బ్లెయిర్ నగరంగా మారింది. భారత స్వతంత్ర పోరాటంలో భాగమైన ఈ నగరం పేరును ఇప్పుడు మోదీ ప్రభుత్వం శ్రీ విజయపురంగా మార్చింది.

Tags:    

Similar News