Central Government Aid to States for Corona: రాష్ట్రాలకు మాస్క్ లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు పంపిణీ

Central Government Aid to States for Corona: కరోనా మహమ్కమారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి.

Update: 2020-07-04 03:15 GMT

Central Government Aid to States for Corona: కరోనా మహమ్కమారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు టెస్ట్ లు నిర్వహించడం.. క్వారంటైన్ కు అవసరమైన ఏర్పాట్లు చూడటం. వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టడం వంటి అంశాలలో తమ తమ పద్ధతులలో ముందుకు వెళుతున్నాయి. ఇక కేంద్రం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని బేరీజు వేస్తూ అవసరానికి తగిన సూచనలు చేస్తున్నాయి. అంతేకాకుండా వీలైనంత వరకూ కరోనా కట్టడిలో తన వంతు సాయం అందిస్తోంది. ఇప్పటివరకు కేవలం నిధులు మాత్రమే పంపిణీ చేసిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన మాస్క్ లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లను సరఫరా చేసింది.

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీని కట్టడి కోసం కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, కేంద్ర సంస్థలకు 2 కోట్లకు పైగా ఎన్95 మాస్కులు, 1.18 కోట్ల పీపీఈ కిట్లు, 11,000 వెంటిలేటర్లను ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కోవిద్-19 కట్టడికోసం ఇప్పటికే 11,300 "మేక్ ఇన్ ఇండియా" వెంటిలేటర్లను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు పంపించినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిలో 6,154 ఇప్పటికే వివిధ ఆస్పత్రులకు పంపించబడ్డాయని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం 1.02 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags:    

Similar News