రైతులకు కేంద్రం తీపి కబురు.. వరి కనీస మద్దతు ధర పెంపు..

Kharif Crops: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.

Update: 2022-06-08 16:00 GMT

రైతులకు కేంద్రం తీపి కబురు.. వరి కనీస మద్దతు ధర పెంపు..

Kharif Crops: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2022-23 సీజన్ ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 17 పంటలకు కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది.

వరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 100 రూపాయలు పెంచారు. 2021-22లో వరికి కనీస మద్దతు ధర ఒక వెయ్యి 940 రూపాయలు ప్రకటించింది. ఈ పెంపుతో క్వింటాల్‌కు ధాన్యం ధర 2 వేల40 రూపాయలకు పెరిగింది. సోయాబిన్‌కు క్వింటాల్‌కు 300, కందులపై 300, పెసర్లుపై 480, నువ్వులపై 523, పొద్దు తిరుగుడుపై 385 కనీస మద్దతు ధర పెంచారు. ఖరీఫ్, రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను తీర్చడానికి భారత్‌లో యూరియా నిల్వలు తగినంత ఉన్నాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Tags:    

Similar News