Central Bank: బీటెక్ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు.. సెంట్రల్ బ్యాంకులో మేనేజర్ పోస్టులు..
Central Bank: బీటెక్ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు.. సెంట్రల్ బ్యాంకులో మేనేజర్ పోస్టులు..
Central Bank Notification: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది మంచివార్తే అని చెప్పాలి. ముఖ్యంగా బ్యాంకు జాబులకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ఒక అవకాశమని చెప్పాలి. సెంట్రల్ బ్యాంకు నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ బ్యాంకు సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఏ విభాగాలలో ఖాళీలు ఉన్నాయో.. ఎవరు అర్హులో తెలుసుకుందాం.
నోటిఫికేషన్‌లో భాగంగా ఇన్నర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మొత్తం 19 సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కచ్చితంగా ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 63,480 నుంచి రూ. 78,230 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-02-2022న మొదలు కాగా చివరి తేదీగా 02-03-2022ని నిర్ణయించారు. రాతపరీక్షను మార్చి 27న నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.