Central Alert: డెంగీ ముప్పు, కోవిడ్‌పై తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు

Central Alert: డెంగీపై ముందస్తుగానే చర్యలు చేపట్టాలి-కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ

Update: 2021-09-20 04:39 GMT
డెంగ్యూ, కరోనా పై కేంద్రం హెచ్చరికలు (ఫైల్  ఇమెజ్)

Central Alert: డెంగీ ముప్పు పొంచి ఉందని, వైరస్‌ వ్యాప్తిపై అలర్ట్‌గా ఉండాలని తెలుగు రాష్ట్రాలు సహా 11 రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఇదిరానున్న రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పింది. డెంగీ విషయంలో ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ సూచించింది. గుజరాత్‌, కర్ణాటక, కేరళతోపాటు మధ్యప్రదేశ్‌, యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో సీరోటైప్‌ సెకండ్‌ డెంగీ ముప్పు పొంచి ఉన్నట్లు తెలియజేసింది.

డెంగీ కేసులను ముందుగా గుర్తించి, ట్రీట్‌మెంట్లు చేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. టెస్ట్‌ కిట్లు సిద్ధంగా ఉంచాలని ఫీవర్‌ హెల్త్‌ లైన్లు, మందులను రెడీ చేసుకోవాలని తెలిపింది. డెంగీ వ్యాప్తిపై ప్రజకు అవగాహన కూడా పెంచాలంది. యూపీలోని ఫిరోజాబాద్‌లో దాదాపు 62 మంది డెంగీ, వైరల్ ఫీవర్‌ కారణంగా చనిపోయారని తెలిపింది.

డెంగీ దోమల లార్వాలను నాశనం చేసేందుకు లార్విసైడ్‌లు ఉంచాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పండగల సీజన్‌లో కరోనా కేసులు పెరిగే ప్రమాదం కూడా ఉందని, కోవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న 15 రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కోవిడ్‌పై ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేసుకోవాలని, కాంటాక్ట్ ట్రేసింగ్‌, ఫీవర్‌ సర్వే చేపట్టాలన్నారు.

Tags:    

Similar News