Petrol Price: ప్రజలకు కేంద్రం దీపావళి బహుమతి..పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు..ఎంత తగ్గాయంటే?
Petrol Price: దేశంలో నిత్యవసరాలతోపాటు ఇంధన ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ప్రజలు తమ ఆదాయంలో సగం వీటికే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తీపికబురు అందించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
పెట్రోల్, డీజిల్ ను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలపై ఆర్ధిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్ధిప్ సింగ్ పూరి తెలిపారు. త్వరలోనే పెట్రోల్ ధర లీటరుకు రూ. 5 తగ్గుతుందన్నారు.
డీజిల్ లీటర్ కు రూ. 2 తగ్గుతుందని తెలిపారు. ధరల్లో ఈ మార్పులతో లక్షలాది మందికి ఉపశమనం లభిస్తుందని మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వం చివరిసారిగా మార్చిలో ఇంధన ధరలను రూ. 2 వరకుతగ్గించింది. అప్పటి నుంచి ధరలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త తగ్గింపు అంతకంతకూ పెరుగుతున్నా ఇంటి, వ్యాపార ఖర్చులను తగ్గించి, ఉపశమనం అందిస్తుంది. కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరీ సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.
పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు డీలర్ కమీషన్లను పెంచడానికి ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరినట్లు మంత్రి తెలిపారు. దీంతో చాలా కాలంగా ఉన్న పెట్రోల్ పంప్ ఆపరేటర్ల డిమాండ్ చాలా వరకు నెరవేరింది. వారు 7ఏండ్ల నుంచి ఎడిషన్ల కమీషన్ల కోసం పోరాడుతున్నారు.
డీలర్ల కమీషన్లను పెంచడం ద్వారా పంప్ ఆపరేటర్లు, కస్టమర్లు ఇద్దరూ మెరుగైన సేవలు, ధరల స్థిరత్వం నుంచి ప్రయోజనం పొందుతారని కేంద్ర మంత్రి పూరీ తెలిపారు. కాగా రాబోయే రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొత్త ఇంధనం ధరలు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు.