Omicron: ఒమిక్రాన్ నేపధ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు
Omicron: అన్నిరకాలు సన్నద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం
Omicron: ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే రాష్ట్రాల ప్రభుత్వాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్న కేంద్రం అన్ని రకాల అంశాలపై 10 సాధికారిక గ్రైపులు ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో సెకండ్‌వేవ్‌తో పోల్చితే 200 రెట్లు ఐసీయూ సదుపాయాన్ని పెంచినట్లు తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా అందుబాటులో దాదాపు 13వేల టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని 25 వేల నుంచి 30 వేలకు పెంచేలా చర్యలు చేపట్టింది. ఇక ఆక్సిజన్ సరఫరా కోసం 16 వందల 50 ట్యాంకర్లను సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం పారామెడికల్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.