సీడీఎస్ చాపర్ క్రాష్ ప్రమాదమేనా.. ట్రై సర్వీస్ ఇచ్చిన రిపోర్ట్‌లో ఏముంది?

CDS Chopper Crash Inquiry Report: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కి సీడీఎస్‌ చాపర్‌ క్రాష్‌పై దర్యాప్తు బృందం నివేదిక సమర్పించింది.

Update: 2022-01-05 08:24 GMT

సీడీఎస్ చాపర్ క్రాష్ ప్రమాదమేనా.. ట్రై సర్వీస్ ఇచ్చిన రిపోర్ట్‌లో ఏముంది?

CDS Chopper Crash Inquiry Report: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కి సీడీఎస్‌ చాపర్‌ క్రాష్‌పై దర్యాప్తు బృందం నివేదిక సమర్పించింది. ఘటన ప్రమాదమే అని తేల్చిచెప్పింది ట్రై సర్వీస్‌ దర్యాప్తు బృందం. కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్‌కు బయల్దేరిన హెలికాప్టర్‌ కూనూరు సమీపంలో దట్టమైన మేఘాల్లో చిక్కుకున్నట్లు తెలియజేశారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా దారి స్పష్టంగా కనిపించకపోవడంతో పైలెట్‌ ఇబ్బందులు పడ్డట్లు తెలిపారు. అయితే దారి కోసం పైలెట్‌ రైల్వే లైన్‌ను అనుసరించినట్లు ఆక్రమంలోనే ప్రమాదవశాత్తు ఎత్తైన శిఖరం అంచున అనూహ్యంగా హెలికాప్టర్‌ ఢీ కొన్నట్లు తెలియజేశారు.

తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో 2021, డిసెంబర్​ 8 హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

Tags:    

Similar News