CBSE Board Result 2020: జులై 15 కల్లా సీబీఎస్ఈ బోర్డు పరీక్ష ఫలితాలు

CBSE Board Results 2020: పెండింగ్‌లో ఉన్న సిబిఎస్ఈ బోర్డ్ క్లాస్ 10 , 12 త‌ర‌గ‌తుల‌ పరీక్షల రద్దుకు సంబంధించి బోర్డు ద్వారా అసెస్‌మెంట్ స్కీమ్‌ నోటిఫికేషన్ జారీ చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.

Update: 2020-06-26 09:20 GMT

CBSE Board Result 2020: పెండింగ్‌లో ఉన్న సిబిఎస్ఈ (cbse exams) బోర్డ్ క్లాస్ 10 , 12 త‌ర‌గ‌తుల‌ పరీక్షల రద్దుకు సంబంధించి బోర్డు ద్వారా అసెస్‌మెంట్ స్కీమ్‌ నోటిఫికేషన్ జారీ చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రి, సంజివ్ ఖ‌న్నాల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం దీనిపై నిర్ణయం తీసుకుంది. బోర్డు పరీక్షల చివరి మూడు పేపర్లలో విద్యార్థులు సాధించిన మార్కులను అసెస్‌మెంట్ స్కీమ్ గా పరిశీలిస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో అనుమతి లభించింది. వాస్తవానికి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు ఈ ఏడాది జూలైలో నిర్వహించాల్సి ఉంది.

అయితే కరోనా నేపథ్యంలో 10, 12వ త‌ర‌గ‌తుల‌కు చెందిన ప‌రీక్ష‌ల‌ను సీబీఎస్ఈ ర‌ద్దు చేసింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తామ‌ని సీబీఎస్‌ఈ గురువారం తెలిపింది. ఇందులో భాగంగా ఇప్పటికే పూర్తయిన బోర్డు పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి సబ్జెక్టులకు మార్కులను కేటాయించనుంది. ఈ నేపథ్యంలో సిబిఎస్ఈ ఫలితాలు 2020 జూలై 15 లోగా ప్రకటించబడుతుందని పరీక్షా కంట్రోలర్ సన్యం భరద్వాజ్ అన్నారు. అంతేకాకుండా, కోవిడ్ -19 పరిస్థితి కారణంగా పెండింగ్‌లో ఉన్న సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దయ్యాయని సన్యం భరద్వాజ్ తెలిపారు.


Tags:    

Similar News