CBSE: జులైలోనే టెన్త్ ఫ‌లితాలు

CBSE: సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫలితాల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

Update: 2021-05-18 17:29 GMT

సీబీఎస్‌ఈ టెన్త్ రిజల్ట్స్  

CBSE: సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫలితాల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ రద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జులైలో విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల నియంత్రణ మండలి స్ప‌ష్టం చేసింది.

జూన్‌ మూడో వారంలోనే పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని సీబీఎస్ ఈ గతంలో వెల్లడించింది. అయితే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా తయారీలో ఆలస్యం కావడంతో ఫలితాలను జులైలో విడుదల చేయనున్నట్లు బోర్డు ప్ర‌క‌టించింది. జూన్ 3వ వారం నాటికి ఇంటర్నల్‌ మార్కులను బోర్డుకు సమర్పించాల్సిందిగా.. అన్ని పాఠశాలలను గతంలో కోరింది. అదే వారంలో ఫలితాలను విడదల చేయాలనుకుంది. కానీ ఈ ప్రక్రియ ఆలస్యం కానుండటంతో అనుకున్న సమయానికి ఫలితాలు వెల్లడించలేకపోతున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. 

Tags:    

Similar News