CBSE 12th Result 2020: జూలై 15 లోపు సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి ఫలితాలు
CBSE 12th Result 2020: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) ఈ ఏడాది 10, 12 వ పరీక్షలకు మెరిట్ జాబితాను జారీ చేసే అవకాశం కనిపించడం లేదు.
CBSE 12th Result 2020 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) ఈ ఏడాది 10, 12 వ పరీక్షలకు మెరిట్ జాబితాను జారీ చేసే అవకాశం కనిపించడం లేదు. అలాగే CISCE కూడా ఈ సంవత్సరం మెరిట్ జాబితాను విడుదల చేయలేదు. ఈ తరుణంలో సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి ఫలితాలను జూలై 15 లోపు ఎప్పుడైనా ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. మెరిట్ జాబితాను విడుదల చేయకూడదనే నిర్ణయం ప్రస్తుతం పరిశీలనలో ఉందని. దీనిపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అలాగే మూల్యాంకన పద్ధతి ఆధారంగా ఫలితాలను లెక్కిస్తున్నామని మరో అధికారి వెల్లడించారు.
భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల కారణంగా సిబిఎస్‌ఇ.. పెండింగ్‌లో ఉన్న బోర్డు పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, సిబిఎస్‌ఇ.. వారి ఫలితాలను మెరుగుపరచాలనుకునే 12వ తరగతి విద్యార్థులకు అప్షనల్ పరీక్షను నిర్వహించనుంది. అదికూడా పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడే ఈ పరీక్షను నిర్వహిస్తారు.
మరోవైపు 10 వ తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు.. ప్రధానంగా ఢిల్లీలో ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో మాత్రమే పరీక్షలు రాశారు. దాంతో వారి పనితీరు మరియు అంతర్గత / ప్రాక్టికల్ ప్రాజెక్ట్ అసెస్‌మెంట్‌లో ఆధారంగా వారి ఫలితాలను లెక్కించాలని నిర్ణయించారు.
కాగా ఈ సంవత్సరం 10 వ తరగతి పరీక్షకు 18 లక్షల మంది, 12 వ తరగతి పరీక్షకు 12 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు తమ డిజిటల్ మార్క్‌షీట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. సిబిఎస్‌ఇ తన సొంత అకాడెమిక్ రిపోజిటరీ ద్వారా మార్క్‌షీట్స్, మైగ్రేషన్ సర్టిఫికేట్, పాస్ సర్టిఫికేట్ వంటి పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.