NEET- UG: నీట్ యూజీ పేప‌ర్ లీకేజీ కేసులో సీబీఐ త‌నిఖీలు

NEET- UG: గుజ‌రాత్‌లోని ఏడు ప్రదేశాల్లో సీబీఐ అధికారుల సోదాలు

Update: 2024-06-29 12:28 GMT

NEET- UG: నీట్ యూజీ పేప‌ర్ లీకేజీ కేసులో సీబీఐ త‌నిఖీలు

NEET- UG: నీట్ యూజీ పేప‌ర్ లీకేజీ కేసులో సీబీఐ త‌నిఖీలు నిర్వహిస్తోంది. గుజ‌రాత్‌లోని ఏడు ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అనుమానితుల ఇండ్ల వ‌ద్ద ఇవాళ ఉద‌యం నుంచి త‌నిఖీ జ‌రుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆనంద్‌, ఖేడా, అహ్మాదాబాద్‌, గోద్రా జిల్లాల్లో ఈ సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌న్నారు. జార్ఖండ్‌లోని హ‌జారీబాగ్‌కు చెందిన ప్రిన్సిప‌ల్‌, వైస్ ప్రిన్సిప‌ల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. నీట్ యూజీ పేప‌ర్ లీక్ కేసులో మ‌రో హిందీ ప‌త్రిక జ‌ర్నలిస్టును కూడా అరెస్టు చేశారు.

నీట్ యూజీ పేప‌ర్ లీక్ కేసులో మొత్తం ఆరు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయ్యాయి. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ న‌మోదు కాగా, ద‌ర్యాప్తు జ‌రుగుతున్న అయిదు రాష్ట్రాల్లో మిగితా కేసులు న‌మోదు అయ్యాయి. బీహార్‌, గుజ‌రాత్‌ల నుంచి ఒక కేసు ద‌ర్యాప్తు జ‌ర‌గ్గా, రాజ‌స్థాన్‌లో మూడు కేసుల్లో ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ అడ్మిష‌న్ల కోసం నీట్ యూజీ ప‌రీక్షల‌ను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ ఏడాది మే 5వ తేదీన 4వేల 750 కేంద్రాల్లో ఆ ప‌రీక్షల‌ను నిర్వహించారు. సుమారు 23 ల‌క్షల మంది ఆ ప‌రీక్షలు రాశారు. జూన్ 23వ తేదీన సీబీఐ త‌న తొలి ఎఫ్ఐఆర్‌ను న‌మోదు చేసింది.

Tags:    

Similar News