Delhi Liqour Scam Case: 3 గంటలుగా సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ
Delhi Liqour Scam Case: సీబీఐకి వ్యతిరేకంగా ఆప్ నేతల ఆందోళనలు
Aravind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణ కొనసాగుతోంది. మద్యం పాలసీపై కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుతో పెద్ద ఎత్తున ముడుపులు మారాయన్న ఆరోపణలతో ఇప్పటికే అనేక మందిని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రపై సీబీఐ ఆరా తీస్తుంది. విచారణ నేపథ్యంలో సీబీఐ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
విచారణకు ముందు వీడియో రిలీజ్ చేసిన సీఎం కేజ్రీవాల్... బీజేపీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ సూచనలనే సీబీఐ పాటిస్తోందని ఆరోపించారు. మాట వినకుంటే జైల్లో పెడతాం అనేలా వ్యవహరిస్తున్నారన్న కేజ్రీవాల్.. తనను అరెస్ట్ చేస్తారంటూ బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు. 8 ఏళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టానని.. 30 ఏళ్లలో గుజరాత్ ఏం అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. దేశాన్ని ప్రేమిస్తా.. దేశం కోసం ప్రాణమిస్తామని వ్యాఖ్యానించారు.