హథ్రాస్ కేసులో కీలక పరిణామం!
దేశవ్యాప్తంగా హథ్రాస్ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకి కారణమైన నలుగురు యువకుల పైన సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదుచేసినట్టు తెలిపింది.
దేశవ్యాప్తంగా హథ్రాస్ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకి కారణమైన నలుగురు యువకుల పైన సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదుచేసినట్టు తెలిపింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 14 న ఉత్తరప్రదేశ్ లోని అగ్రవర్ణాలకు చెందిన నలుగురు యువకులు దళిత యువతి పైన సాముహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువతి నాలుక కోసి, వెన్నుముక విరిచి దాడి చేసినట్టుగా పోలిసుల విచారణలో తేలింది. అనంతరం ఆ యువతిని వైద్యం కోసం ఢిల్లీలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ఈ కేసు పైన యోగి సర్కార్ ముందుగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించగా, ఆ తరవాత సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణను అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తోంది.