తెలుగు రాష్ట్రాల నేతలపైనే ఎక్కువ సీబీఐ కేసులు..: కేంద్రం

Cases Against MLAs, MPs: దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే ఎక్కువ సీబీఐ కేసులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

Update: 2022-12-07 15:30 GMT

తెలుగు రాష్ట్రాల నేతలపైనే ఎక్కువ సీబీఐ కేసులు..: కేంద్రం

Cases Against MLAs, MPs: దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే ఎక్కువ సీబీఐ కేసులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఐదేళ్లలో 2017 నుంచి 2022 వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన సీబీఐ కేసులు ఎక్కువ ఉన్నట్లు చెప్పింది. ఎంపీ మాలరాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో 56 సీబీఐ కేసులు నమోదవగా అందులో 10 కేసులు తెలుగు రాష్ట్రాలవేనని చెప్పారు. 56 కేసుల్లో ఇప్పటివరకు 22 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఏపీ, తెలంగాణలో 10 కేసులు నమోదవగా ఆ తరువాత ఉత్తరప్రదేశ్, కేరళలో ఆరు కేసులు, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్‌లో 5 కేసుల చొప్పున నమోదు అయినట్లు చెప్పారు. 

Tags:    

Similar News