CBI Case: జీవీకే గ్రూప్‌పై సీబీఐ చీటింగ్ కేసు
CBI Case: జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.
CBI Case: జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, ముంబై ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ అయిన జీవీ సంజయ్ రెడ్డి తదితరులపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. 2012-18 మధ్య 9 కంపెనీలు వర్క్ లో రూ 800 కోట్లు ఆర్జించారనే కారణంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్‌తో ఒప్పందం చేసుకున్న జీవీకే మోసానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది.
జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ 800 కోట్లను దుర్వినియోగం చేశారని సీబీఐ తెలిపింది. జీవీకే గ్రూప్ ఛైర్మన్ అయిన వెంకట కృష్ణారెడ్డి గునుపాటి, అతని కుమారుడు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జీవీ సంజయ్ రెడ్డిలతోపాటు మియాల్, జీవీకే పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరో 9 ప్రైవేటు కంపెనీలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌కు 50.5 శాతం వాటా ఉండగా.. ఎయిర్‌పోర్ట్ అథారిటీకి 26 శాతం వాటా ఉంది. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని 200 ఎకరాల ఏఏఐ భూముల అభివృద్ధి కోసం ఎంఐఏఎల్ రూ.200 కోట్ల బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించింది. ఫలితంగా రూ.305 కోట్ల నిధులను మళ్లించింనీ ఆరోపణలు వచ్చాయి.